Chiranjeevi: తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఈ సినిమా కూడా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుందని అనిల్ చెబుతున్నాడు. ఈ సినిమాలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నట్లు అనిల్ పలు సందర్భాల్లో తెలిపాడు.

Also Read: Fennel Seeds: భోజనం తర్వాత సోంపు తినడం మంచిదా చెడ్డదా?
అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
అంటే ‘రౌడీ అల్లుడు’ లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. మరి నిజంగానే చిరంజీవి కోసం ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి ఫిక్స్ చేశాడా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Waltair Veerayya – Boss Party Video

