Sankrantiki Vastunnam: సంక్రాతి.. టాలీవుడ్ కి పెద్ద పండగ. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు . . గొబ్బెమ్మలు . . కొత్త అల్లుళ్ళు . . కోడి పందాలు . . ఇలా అన్నీ వేడుకలే. అయితే , వీటికి తోడుగా సినిమా కూడా పండగలో ఒక భాగంగా ఉంటుంది . ఇంటిల్లిపాదీ పండగను ఎంజాయ్ చేస్తూనే.. మూవీస్ కోసం థియేటర్ల వద్ద సందడి చేస్తారు. అందుకే సంక్రాతి వస్తుంది అంటే పెద్ద హీరోలు తమ సినిమా ఉండాలని తహతహలాడతారు. నిర్మాతలు కూడా సంక్రాంతికి తమ సినిమా విడుదల కావాలని విశ్వప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి సంక్రాంతి విడుదల విషయంలో నిర్మాతల మధ్య చిన్నపాటి యుద్ధాలు జరగడం కూడా ఉంటుంది . ఇంత ప్రాధాన్యత ఉన్న సంక్రాంతి సినిమా బరిలో నిలిచి సినిమా హిట్టు కొట్టిందంటే అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది.
Sankrantiki Vastunnam: ఇదిగో ఈ సంక్రాంతికి అలాంటి మేజిక్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్ళని కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఇది సంక్రాంతి సినిమా అని చెప్పి . . ఏకంగా దానినే టైటిల్ గా పెట్టి అనిల్ రావిపూడి వినోదాల విందు అందించారు . వెంకటేష్ లాంటి హీరోతో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తీయడమే కాకుండా సంక్రాతి సినిమాల్లో మా సినిమా ది బెస్ట్ అవుతుంది అంటూ ప్రచారాన్ని చేసి మరీ సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకువెళ్లారు.
సినిమా చివరిలోనే తానే స్వయంగా కనబడి మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం అంటూ సీక్వెల్ ఉంటుంది అంటూ చిన్న లీడ్ వదిలారు . ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి సీక్వెల్ తయారు చేసే పనిలో పడ్డారు. దీనికి టైటిల్ కూడా “సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం” అని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే , సీక్వెల్ లో హీరో వెంకటేష్ కాదని కూడా టాలీవుడ్ లో టాక్.
Sankrantiki Vastunnam: అదేంటి అనుకుంటున్నారా ? ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఇంకోటి ఉంది . . సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అంటావు ఈసారి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నారని అంటున్నారు. మెగాస్టార్ తో సినిమా ఉంటుంది అని అనిల్ రావిపూడి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా ఇదే అని అనుకుంటున్నారు. అంటే ఈ సినిమాలో ఈసారి హీరోగా మెగాస్టార్ నటిస్తారని సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే నెల నుంచి సినిమా పట్టాలెక్కించి, వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.
అసలే అనిల్ రావిపూడి . . దానికి తోడు చిరంజీవి . . అసలు ఆ కాంబినేషన్ లో కామెడీ అంటేనే ఊహించుకోవచ్చు. ఇదే కనుక వర్కౌట్ అయితే, వచ్చే సంక్రాంతికి మెగా కామెడీ ఎంటర్టైనర్ కోసం సకుటుంబ సపరివార సమేతంగా రెడీ అయిపోవచ్చు . ఏమంటారు ?