MEGA 157

MEGA 157: అభిమానుల్లో ఫుల్ జోష్.. చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి

MEGA 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ పాన్‌ఇండియా స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్‌తో కలసి పనిచేయడం వల్ల సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

డ్రిల్ మాస్టర్ పాత్రలో చిరు

ఈ సినిమాలో చిరంజీవి స్కూల్‌లో పిల్లలకు ఆటలు నేర్పించే ‘డ్రిల్ మాస్టర్’ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ రోల్‌తో మళ్లీ వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామనే ఉత్సాహం మెగా అభిమానుల్లో కనబడుతోంది.

ఇది కూడా చదవండి: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రెడ్‌ అలెర్ట్‌ జారీ

శంకర వరప్రసాద్ పాత్ర – టైటిల్ క్లారిటీ

తాజాగా ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో నిర్మాత సుష్మిత కొణిదెలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌పై ఆసక్తికర విషయాన్ని అనిల్ పంచుకున్నారు. చిరంజీవి ఇందులో ‘శంకర వరప్రసాద్’ అనే పాత్రలో నటిస్తున్నారని, టైటిల్ కూడా ఆ నేపథ్యంతోనే ఉంటుందని ఆయన పరోక్షంగా తెలిపారు.
“మన శంకర వరప్రసాద్ గారు” అని అనిల్ చెప్పడం విన్న అభిమానులు, టైటిల్ ఇదే అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ – బర్త్‌డే కానుకగా టైటిల్ గ్లింప్స్

ఈ చిత్రాన్ని రాబోయే సంక్రాంతి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 22న టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు

ఇప్పటికే మెగాస్టార్–అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, టైటిల్, రిలీజ్ డేట్ అప్‌డేట్స్‌తో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. వినోదం, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *