Karthi

Karthi: అన్నగారు వస్తారు: ఎంటర్‌టైనర్ పోలీస్‌గా కార్తి!

Karthi: తమిళ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న ‘వా వాతియార్’ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ను అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

Also Read: Prabhas: ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ షాకింగ్ నిర్ణయం!

కార్తి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’ తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో రిలీజ్ కానుంది. నలన్ కుమారసామి దర్శకత్వంలో రూపొందిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయింది. తాజాగా విడుదలైన టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ మ్యూజిక్‌తో సాగింది. పోలీస్ ఆఫీసర్‌గా కార్తికి ఘన స్వాగతం లభించడం, డ్యాన్స్ చేస్తూ రావడం వంటి సీన్స్ ఆకట్టుకున్నాయి. కృతి శెట్టితో పాటు సత్యరాజ్, ఆనందరాజ్, రాజ్‌కిరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ చూస్తే యాక్షన్‌తో పాటు కామెడీ ప్యాకేజీ కూడా భారీగా ఉంటుందని అర్థమవుతోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *