Anil Kumar Singhal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా జె. శ్యామలరావును టీటీడీ ఈవో పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. జూన్ 2024లో టీటీడీ ఈవోగా జె. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కుమార్ సింఘాల్ గతంలో కూడా రెండుసార్లు టీటీడీ ఈవోగా పనిచేశారు (2016-2018, డిసెంబర్ 2022లో తాత్కాలికంగా). ఇప్పుడు ఆయనను మళ్లీ పూర్తిస్థాయి టీటీడీ ఈవోగా నియమించారు. ఈ నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జె. శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
Also Read: KTR: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు
పలువురు ఐఏఎస్‌లు బదిలీలు:
ఎంటీ కృష్ణబాబు – రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్, బిల్డింగ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
సౌరభ్ గౌర్ – మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు.
ముకేష్ కుమార్ మీనా – ఎక్సైజ్, మైనింగ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
హరి జవహర్ లాల్ – రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
కాంతిలాల్ దండే – అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
ప్రవీణ్ కుమార్ – ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ పొందారు.
