Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డ్రాగన్. ఈ చిత్రం భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్లో ప్రారంభం కానున్న నెక్స్ట్ షెడ్యూల్లో అనిల్ కపూర్ జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ మొత్తం కొనసాగనుంది. అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

