Andrea: ప్రేక్షకులను ఉరకలు పరిచిన ‘పిశాచి’ సీక్వెల్ ‘పిశాచి 2’పై హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూడిటీ లేకపోయినా ఎరోటిక్ సన్నివేశాలు ఉంటాయని ఆమె స్పష్టం చేయడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ను మిస్కిన్ రూపొందిస్తున్నారు.
Also Read: Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ సినిమా రీ-రిలీజ్!
అందాల భామ ఆండ్రియా ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నారు. చాలా ఏళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ చిత్రంపై ఇటీవల ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. “సినిమాలో న్యూడిటీ ఏమీ లేదు కానీ ఎరోటిక్ సన్నివేశాలు ఉంటాయి” అని ఆమె బహిరంగంగా చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేగింది. విజయ్ సేతుపతి కీలక కేమియో పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, సంతోష్ ప్రతాప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌ఫోర్డ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇళయరాజా కుమారుడు కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
