Andhra Pradesh

Andhra Pradesh: బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్: అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్లే రెండు కీలకమైన బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కేంద్రం ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరుతో హైస్పీడ్ రైలు మార్గాల ద్వారా అనుసంధానిస్తాయి. ఈ కారిడార్లు అందుబాటులోకి వస్తే, గంటల కొద్దీ పట్టే ప్రయాణ సమయం గంట, రెండు గంటలకు తగ్గిపోతుందని భావిస్తున్నారు.

1. హైదరాబాద్-చెన్నై వయా అమరావతి
హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు నిర్మించతలపెట్టిన ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 744.5 కిలోమీటర్లు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది. ఈ కారిడార్ తెలంగాణలో 236.48 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 448.11 కి.మీ.,  తమిళనాడులో 59.98 కి.మీ. మేర ఉంటుంది.

ముఖ్య స్టేషన్లు:
ఈ మార్గంలో మొత్తం 15 స్టేషన్లు ప్రతిపాదించారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు (హైదరాబాద్, శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ), ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది స్టేషన్లు (అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ) తమిళనాడులో ఒక స్టేషన్ ఉంటాయి. ఈ మార్గం తిరుపతి మీదుగా వెళ్లేలా మార్పులు చేస్తే, భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Liquor Scam: లిక్కర్‌ స్కామ్ ట్రైలర్‌‌.. ఎవడో కానీ చావగొట్టాడు భయ్యా!!

2. హైదరాబాద్-బెంగళూరు వయా కర్నూలు, అనంతపురం
మరో కీలక ప్రాజెక్ట్ హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్. ఇది చాలా వరకు హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. మొత్తం 576.6 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కారిడార్ తెలంగాణలో 218.5 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 263.3 కి.మీ.,  కర్ణాటకలో 94.8 కి.మీ. మేర ఉంటుంది. మేర ఉంటుంది.

ముఖ్య స్టేషన్లు:
ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం, దుద్దేబండ వద్ద స్టేషన్లు ప్రతిపాదించారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీ సమీపంలో ఒక ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే, దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలు (హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి) ఒకే బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌గా అనుసంధానమవుతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *