Andhra Pradesh: ఇంటి వద్ద ఉన్న పిల్లలు ఇష్టమైన ఆహారాన్ని అమ్మానాన్నలతో చెప్పి కొనిపించుకొని తింటుంటారు. మరి స్కూళ్లలో, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఆ అవకాశం ఉండదు. కానీ, ఇక్కడ అందరూ కలిసి ఏదైనా ఇష్టమైన ఫుడ్ తిందామా? అనుకున్నారా? బిర్యానీ తెచ్చుకుని తిన్నారు. ఇంకేముంది ఆ హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్థులను ఇష్టారీతిన చితకబాదారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఈఘటన చోటుచేసుకున్నది. ఆ స్కూల్‌లోని 8వ తరగతి విద్యార్థులైన 26 మంది చికెన్ బిర్యానీ తెచ్చుకొని తిన్నారు. బయట నుంచి ఫుడ్ ఎలా తెచ్చుకుంటారని ఇష్టారీతిన విద్యార్థులను ఆ స్కూల్ లైబ్రరీ సిబ్బంది చితకబాదారు. విచక్షణారహితంగా వారిపై కర్రలతో దాడి చేయడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి.
Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వచ్చే సరికి తీవ్రగాయాలతో కనిపించాడు. ఇదేమిటని ప్రశ్నించడంతో సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాళ్లపై వాతలు వచ్చే కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళ్లు కమిలిపోయేలా తమ కుమారుడిని కొట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
Andhra Pradesh: తమ పిల్లలను కొట్టిన సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. హాస్టల్‌లో మెనూ సరిగా లేని కారణంగానే తాము బయటి నుంచి ఒకరోజు బిర్యానీ తెచ్చుకున్నామని విద్యార్థులు చెప్తున్నారు. ఒకవేళ ఆ విద్యార్థులను మందలించి వదిలేసినా సరిపోయేదని, విచక్షణారహితంగా గాయలొచ్చేలా కొట్టడమేమిటని స్థానికులు సైతం ప్రశ్నిస్తున్నారు.

