Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..

Andhra Pradesh People: అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ ప్లేసులో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60వేల 093 మంది అప్పులు చేస్తున్నట్టు కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. అప్పులు తీసుకునే విషయంలో పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారు. అలాగే, పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ మహిళల్లో అప్పులు ఉన్నవారు 32.86 శాతం, పురుషుల్లో 1.56 శాతం ఎక్కువ ఉన్నారు.

అప్పులున్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య 21.69 శాతం అధికం. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 7.49 శాతం అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ పురుషులకు మించి మహిళలకు అప్పుల్లేవు.

జులై 2022 నుంచి జూన్ 2023 మధ్య ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్ష మందిలో 11,844 మందిపైనే అప్పులున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ప్రజలపై రుణభారం ఎక్కువగా ఉన్నట్టు సర్వే వివరించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *