pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని పరీక్షల అవసరం ఉన్న కారణంగా, ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఆయన తిరిగి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

సయాటికా సమస్యతో పవన్ కళ్యాణ్

కొన్ని కాలంగా పవన్ కళ్యాణ్ సయాటికా అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరంగా మేలు కలగాలని, ఇటీవల కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని, తాజాగా ప్రయాగరాజ్‌లో పుణ్య స్నానం కూడా ఆచరించారు. అయితే, అకస్మాత్తుగా అపోలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో, ఆయన అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mahindra XEV 7e: ఫిదా చేసే ఫీచర్లతో రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్‌ కారు

బడ్జెట్ సమావేశాల్లో హాజరవుతారా? 

ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అయితే, వైద్యుల సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని తెలుస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషిస్తున్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరి దృష్టి ఉంది. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం రావడంతో, అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *