CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న హామీలతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

తల్లికి వందనం పథకం:
వచ్చే మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్:
అకడమిక్ ఏడాది ప్రారంభానికి ముందే, అంటే 2024 జూన్‌లో, 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చి, జూన్‌లో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే నాటికి పోస్టింగ్‌లు అందచేస్తామన్నారు.

నిరుద్యోగ భృతి:
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు త్వరలోనే రూ.3,000 భృతి అందించనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: Tamil Nadu: తమిళనాడులో అమానుష ఘటన..3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన 16 ఏళ్ల బాలుడు

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల:  డిసెంబర్ 2024 సెషన్‌కు సంబంధించిన జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షల అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ ద్వారా కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షను ఎన్టీఏ యేటా రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

గమనిక: అడ్మిట్ కార్డుపై ఫోటో, సంతకం, బార్‌కోడ్ లాంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే, అభ్యర్థులు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *