AAA 1st Convention: అమెరికాలో మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడానికి – తెలుగు సమాజాన్ని ఒక్కటి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) స్ఫూర్తిగా పనిచేస్తోంది. ‘మన తెలుగు భాషా సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, మన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి తెలుగువారి బాధ్యత’ అనే ఆలోచనలతో AAA, ఎన్నారై తెలుగువారిని ఒక్కటిగా చేర్చి, ముందుకు తీసుకెళ్తోంది.
అమెరికాలో ఉంటున్న తెలుగు వారి కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ . . తెలుగు సంప్రదాయపు మాధుర్యాన్ని సుదూరతీరాల్లో కూడా మనసున పట్టి ఉంచేలా చేస్తోంది AAA. దసరా . . దీపావళి . . సంక్రాంతి పండగ ఏదైనా . .ఆగస్టు 15.. జనవరి 26 ఇలా మన దేశ ప్రత్యేకతను తెలిపే దినోత్సవాలు ఏవైనా వాటిని ఉత్సాహభరితంగా నిర్వహిస్తూ . . భారత దేశం . . అందులో తెలుగు ప్రజలు అనే స్ఫూర్తిని అందరిలో పెంచుతోంది AAA.
AAA 1st Convention: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొదటి నేషనల్ కన్వెన్షన్ జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది . ఈ నెల 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు AAA మొదటి నేషనల్ కన్వెన్షన్ వేడుకగా జరగనుంది . వెండి తెరపై తమ ప్రత్యేకతను చాటి చెప్పిన ప్రముఖ టాలీవుడ్ నటీనటులు . . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నిత్యం శ్రమిస్తున్న ప్రముఖ రాజకీయ నేతలు కార్యక్రమానికి మరింత వెలుగు తేనున్నారు . ఇక కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక గ్రాండ్ మ్యూజిక్ కన్సర్ట్ తో నెక్స్ట్ లెవెల్ లో ప్రోగ్రామ్ ప్రెజెంట్ చేయనున్నారు .
AAA 1st Convention: మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ మహా ఈవెంట్ లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మార్చి 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు అమెరికాలో తెలుగువారిని అలరించడానికి పసందైన ఈవెంట్స్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA). మొదటి రోజు అంటే మార్చి 28వ తేదీ.. 4 గంటల నుంచి 10 వరకూ Banquet Night పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బ్యాండ్ నిరావాల్ లైవ్ పెర్ఫార్మెన్స్ అందరినీ అలరించనుంది. ఆ తరువాత కళ్ళు చెదిరే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆశ్చర్యపరిచే విధంగా సాగేలా ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు.. ప్లే జోన్ సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే రుచికరమైన వంటలతో సిద్ధం అవుతున్న స్పెషల్ డిన్నర్ ప్రోగ్రామ్ మెమరబుల్ గా ఉండేలా ఉంటుంది. సెలబ్రిటీలతో కల్సి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తున్నారు.
AAA 1st Convention: ఇక కార్యక్రమాల రెండో రోజు అంటే, మార్చి 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉల్లాసాన్నిచ్చే మారథాన్ కార్యక్రమాలు మీకోసం సిద్ధం అవుతున్నాయి. శ్రీ శ్రీనివాస కల్యాణంతో తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగాన్ని మీముందు ఆవిష్కరించడంతో కన్వెన్షన్ కార్యక్రమాలు మొదలవుతాయి. దీనితో పాటు వచ్చే తెలుగు సంవత్సరం మీ అందరికీ నూతనత్సాహాన్ని రేకెత్తించేలా పండితులతో పంచాంగ శ్రావణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడితో మన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ కార్యక్రమాలు ముగించుకుని.. ఎంటర్టైన్మెంట్ పీక్స్ కి తీసుకువెళ్లేలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కాన్సెర్ట్ మిమ్మల్ని సినీ సంగీతంలో ఉర్రుతలూగిస్తుంది.
AAA 1st Convention: ఇక రోజంతా రకరకాలైన కార్యక్రమాలు మీకోసం సిద్ధం అవుతున్నాయి. టాలీవుడ్ దర్శకులతో ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమం డైరెక్టర్ ఫోరమ్ అలానే అమెరికాలోని టాప్ ఎంటర్ఫేన్యూర్స్ తో స్పెషల్ చిట్ చాట్ బిజినెస్ ఫోరమ్.. ఉంటాయి. వీటితో పాటు ప్రముఖ సెలబ్రిటీలు మీరడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సందడి చేసే కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ విత్ సెలబ్రిటీస్ ఉంటుంది. ఇక పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఉన్నాయి. ఆరోజు లంచ్, డిన్నర్ సెలబ్రిటీలతో కలిసి చేసే ముచ్చటైన అవకాశం కూడా కల్పిస్తున్నారు.
ఇవీ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి కన్వెన్షన్ ప్రత్యేక కార్యక్రమాల సరళి. ప్రతి ఒక్కరూ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం ప్రదీప్ బలిజ – +1(630) 402-5374, రవి చిక్కాల +1(484) 280-4610 లను సంప్రదించవచ్చు