Andhra Pradesh : ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుడా కేవలం ఏడాది వ్యవధిలో ఏకంగా 2 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ వృద్ధిని నమోదు చేయడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. ఇదే దూకుడును కొనసాగిస్తే… త్వరలో రాష్ట్రం వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ వన్ స్టానంలో నిలవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ గణాంకాల్లో తనదైన దూకుడు ప్రదర్శించిన తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. అత్యధికంగా 9.69 శాతం వృద్ది రేటుతో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అదే సమయంలో 8.21 వృద్ది రేటుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.19 శాతం వృద్ది రేటును నమోదు చేసిన ఏపీ గడచిన ఏడాదిలో 2 శాతానికి పైబడి వృద్ది రేటును పెంచుకోవడం గమనార్హం. ఈ గణాంకాలను చూసిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. గడచిన 10 నెలల కాలంలోనే విధ్వంసకర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగలిగామని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఉత్పత్తి రంగం, సేవల రంగాల్లో విశేష పురోగతి సాధించామన్న చంద్రబాబు… ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించడంతోనే రాష్ట్ర వృద్ధిరేటు పెరుగుదలకు దోహదపడిందని అబిప్రాయపడ్దారు. ఇదే జోరును కొనసాగిస్తూ ముందుకు సాగుదామని.. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదామని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మొన్న ఓ ప్రెస్మీట్‌లో….. ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన ‘P4 – మార్గదర్శి – బంగారు కుటుంబం’ అనే కాన్సెప్ట్‌ని విమర్శిస్తూ, చెప్పాలంటే.. అవహేళన చేస్తూ మాట్లాడారు.
Andhra Pradesh : పండుగ రోజు శుభమా అని ప్రభుత్వం ఓ మంచి కార్యక్రమం పెట్టుకుంటే.. జగన్ ఏడ్చే ఏడుపులు ఇలా ఉన్నాయ్. ఇదీ ఆయన తంతు. P4 అనేది ప్రజలకు డబ్బులిచ్చే పథకం కాదు. ప్రభుత్వ ఖజానాపై ఒక్క రూపాయి భారం పడదు. సమాజంలో ఉన్న సంపన్నులను, సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలన్న మనస్థత్వం ఉన్నవాళ్లని ప్రోత్సహించి, వారికి ఒక ప్లాట్ ఫామ్ ఏర్పరచడం ద్వారా, పేదలను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ఓ విప్లవాత్మకమైన ప్రయత్నం. ఇది సక్సెస్ అయితే ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శిగా నిలుస్తుందని ఆర్థికవేత్తలు సైతం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుకొచ్చి మంచి కార్యక్రమంలో భాగమవ్వాలి. లేదంటే సైలెంట్ అయినా ఉండాలి. కానీ వైసీపీలో జగన్‌ని నడిపించే మేథావి వర్గం స్టయిలే వేరు. వారిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని మీడియా ముందుకొచ్చి ఇలా అభాసుపాలయ్యారు.
నిజానికి ‘సంపద సృష్టి’ అనేది జగన్ స్కూల్ కాదు. ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయన ఫోకస్ అంతా తన సొంత సంపదని పెంచుకోవడం మీదే ఉంటుంది. దాన్ని కూడా సంపద సృష్టి అనలేం. ఎందుకంటే జగన్ వ్యాపారాలన్నీ సంపద దోపిడీ మీదే ఉంటాయి తప్ప.. సంపద సృష్టి మీద నడవవు అన్నది పలువురు పరిశీలకుల అభిప్రాయం. అందుకే జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో సంపద సృష్టి అనే మాటే వినిపించలేదు. అప్పులు చేసి రాష్ట్రం ఆర్థికంగా సూపర్ అని జగన్ తనకు తానే కితాబిచ్చుకునే వారు. జీఎస్డీపీ పెరిగిందనేవారు. నిజానికి అక్కడ జీఎస్డీపీ ఆదాయం కానీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయం కానీ ఏదీ పెరగలేదు. ఒక్క ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగింది. పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని గుడ్డిగా వాదించేవాళ్లు. కాగ్ ఏమో రాజ్యంగ విరుద్ధంగా అప్పులు చేశారని వైసీపీ ప్రభుత్వానికి మొట్ట్టికాయలు వేయేది.
Andhra Pradesh : 2014లో పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారం చేపట్టారు. మొదటి సంవత్సరంలో రూ.29,857 కోట్లు ఆదాయం ఉంటే దాన్ని 2019 నాటికి 58,091 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 98 శాతం వృద్ధి సాధించారు. ఐదేళ్ల విధ్వంసం తర్వాత తిరిగి రాష్ట్రం పగ్గాలు చేపట్టి ఇప్పుడూ అదే చేస్తున్నారు. సంపద సృష్టికి చంద్రబాబు ట్రేడ్ మార్క్ లాంటి వ్యక్తి. ఈ విషయంలో ఆయన సమీపానికి కూడా జగన్ రాలేరన్నది గత ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన వారికి అర్థమవుతుంది. చివరగా… సంపద సృష్టి అనేది ఒక కళ. దానికి కష్టపడాలి. స్వార్థం వీడాలి, ప్రజలకోసం పాటుపడాలి. ఎకనామిక్ ప్లానింగ్ కావాలి. దానికి ముందుచూపు ఉండాలి. దార్శనికత కావాలి. అన్నింటికీ మించి ప్రజల మీద మమకారం ఉండాలి. ఈ లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టే… పది నెలల కాలంలోనే ఏపీని దేశంలోనే నంబర్ 2 స్థానంలో నిలిపారు. ఇకనైనా జగన్ మోహన్‌రెడ్డి.. స్క్రిప్ట్ పట్టుకుని వచ్చి, సంపద సృష్టి, P4 వంటి పెద్ద పెద్ద మాటలు, విమర్శలకు పోకుండా… తనదైన గ్రౌండ్స్‌లో పాలిటిక్స్ చేస్తే భవిష్యత్తుకు ఏదైనా ఉపయోగం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు అనలిస్టులు.