Andhra King Taluka Twitter Review

Andhra King Taluka Twitter Review: ఫ్యాన్ కోసం హీరో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ట్విట్టర్ రివ్యూ..

Andhra King Taluka Twitter Review: గత కొన్నేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎట్టకేలకు ఘన విజయాన్ని అందుకున్నారా? నేడు (నవంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఆయన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సోషల్ మీడియా (X / ట్విట్టర్)లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

రామ్ వన్ మ్యాన్ షో, హార్ట్‌ఫుల్ డ్రామా!

వివిధ ఓవర్సీస్ సెంటర్లలో, దేశంలోని పలు ప్రాంతాలలో ఫస్ట్ డే ఫస్ట్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను X (ట్విట్టర్) ద్వారా పంచుకుంటున్నారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో రామ్ తన ఖాతాలో మరో హిట్‌ను చేర్చుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రేక్షకుల స్పందనలోని ముఖ్యాంశాలు:

ఈ సినిమాలో రామ్ పోతినేని నటన పరంగా ప్రాణం పెటేసాడు అంటున్నారు. తన ఎనర్జీ తో  ఇంకా ఎమోషన్స్‌తో రామ్ ‘వన్ మ్యాన్ షో’ ను ప్రదర్శించారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.దర్శకుడు మహేష్ బాబు పి మరోసారి తన హృదయాన్ని హత్తుకునే డ్రామాని హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యారని ప్రశంసలు దక్కుతున్నాయి. క

థనాన్ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుందట. రామ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అదేవిధంగా సినిమాలో రాసుకున్న పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించడం సినిమా అవుట్‌పుట్‌కు ప్లస్ అయ్యిందని చెబుతున్నారు.

ఫ్యాన్స్ పండగే.. కానీ చిన్న మైనస్!

ప్రారంభ ట్విట్టర్ రివ్యూల ప్రకారం, సినిమా క్లైమాక్స్ ప్రత్యేకంగా నిలిచిందని, ఇది రామ్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి సినిమా అని ఒక నెటిజన్ అభివర్ణించారు. అయితే, కొన్ని చిన్న మైనస్‌లను కూడా ప్రేక్షకులు ప్రస్తావించారు.మొదటి 30 నిమిషాలు (ఫస్టాఫ్‌లో కొంత భాగం) కాస్త నెమ్మదిగా సాగడం కొంత మైనస్‌గా ఉందట. సినిమా నిడివి (రన్ టైమ్) కాస్త ఎక్కువ అని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, ఈ సినిమా రామ్ పోతినేనికి ఎంతగానో అవసరమైన విజయాన్ని అందించి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *