Andhra King Taluka Trailer: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా, దర్శకుడు పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. “ఎల్లండి, ఎల్లండి, ఎల్లండి.. 10 నిమిషాల్లో ఆట మొదలయిపోతుంది” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలై ఆకట్టుకుంది. “నా కథకి ఆయనే హీరో,” “నువ్ ఇంతే. ఇక నీ బతుకింతే,” వంటి ఎమోషనల్ డైలాగ్‌లు ట్రైలర్ లో ఉంచడం తో సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి” అనే డైలాగ్ తో ఫ్యాన్స్ ఎలాఉంటారో చూపించారు దర్శకుడు.
సినిమాలో కీలక అంశాలు
ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఒక హీరో అభిమాని జీవితం ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అభిమానుల ఎమోషన్స్, హీరోపై వారికున్న అపారమైన ప్రేమను దర్శకుడు మహేష్ బాబు శక్తివంతంగా చూపించినట్లు సమాచారం.ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించడంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నవంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం, రామ్ పోతినేనికి మరో భారీ విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

