Andhra King Taluka: రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ నెల రోజుల కీలక షెడ్యూల్‌లో రామ్‌తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఈ సినిమాలో సాగర్ అనే ఫ్యాన్ పాత్రలో కనిపిస్తుండగా, ఉపేంద్ర సూపర్‌స్టార్ సూర్యకుమార్‌గా నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. రాజమండ్రిలో ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
ఈ సినిమా ఫ్యాన్ కల్చర్‌ను ఆవిష్కరిస్తూ 2000ల నాటి సినిమా వాతావరణాన్ని చూపిస్తుందని టాక్. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, వివేక్-మెర్విన్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌తో ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. రామ్ రస్టిక్ లుక్, ఉపేంద్రతో స్క్రీన్ షేరింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమా తెలుగు సినిమా ప్రియులకు కొత్త అనుభవాన్ని అందించనుంది.