Anasuya: టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ సోషల్ మీడియాలో విమర్శలపై ఘాటుగా స్పందించారు. బోల్డ్ గా ఉండడాన్ని కొందరు మహిళలే విమర్శించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“తల్లి అయ్యానని, భార్యనని – నేను ఎలా ఉండాలో ఇతరులు నిర్ణయించలేరు. నా కుటుంబానికి నా ప్రవర్తనపై ఎలాంటి అభ్యంతరం లేదు. నా భర్త, నా పిల్లలు నన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వాళ్లకైనా అభ్యంతరం లేని విషయాన్ని, విడి విడిగా వీడియోలు చేసి విమర్శించడం ఎంతవరకు సమంజసం?” అంటూ ఆమె ప్రశ్నించారు.
బోల్డ్ గా ఉండటం అంటే అమర్యాదకత కాదు, అని అనసూయ స్పష్టం చేశారు.
“నాకు నచ్చిన దుస్తులు వేసుకోవడం, నా స్టయిల్ ను ఎంజాయ్ చేయడం నేరమా? మహిళ అనగానే ఒరియాల్సిన నియమాలు ఎందుకు పెడుతున్నారు? తల్లి అయినంత మాత్రాన తనకు నచ్చిన జీవనశైలి కొనసాగించకూడదా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అనసూయ స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.