Ananya Pandey: ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్2’తో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే ఆ తర్వాత తెలుగు సినిమాలోనూ మెరిశారు. గతేడాది ‘డ్రీమ్ గర్ల్2’గా వచ్చిన ఈ భామ ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’తో భారీ హిట్ కొట్టింది. అయితే తెలుగులో అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలసి చేసిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం ‘శంకర’ సినిమాలో నటిస్తున్న ఈ భామ త్వరలోనే క్రికెటర్ ని పెళ్ళాడబోతోందట. ఇండియా అండర్ 19కి ఆడిన రియాగ్ ఆ తర్వాత ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో కీలక సభ్యుడుగా రాణిస్తున్నాడు. ఇండియన్ టీ20 టీమ్ కి, వన్ డే ఇంటర్నేషనల్ కి కూడా సెలక్ట్ అయిన ఇతగాడు అనన్య పాండే లుక్స్ కి క్లీన్ బోల్డ్ అయ్యాడట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో మునిగి తేలుతున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 29న వీరి వివాహం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి పెళ్ళి తర్వాత కూడా అనన్య నటిస్తుందో? లేదో చూడాలి.
