యువచంద్రకృష్ణ, అనన్య నాగాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పొట్టేల్’. ఇటీవల కంటెంట్ బేస్డ్ గా రూపుదిద్దుకుంటున్న సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. ఇదే కేటగిరీలో ఈ దీపావళికి పొట్టేల్ దూసుకొస్తోంది. ఈ మూవీని సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేశాడు. పక్కా విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో ఎమోషన్ రైడ్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 1980 కాలం నాటి తెలంగాణలోని పరిస్థితులను మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. తన కూతురు చదువు కోసం ఓ తండ్రి ఎదుర్కొనే సమస్యలు.. ఓ పొట్టేలు వారికి ఎలాంటి అడ్డంకులను తెచ్చి పెట్టిందనేది ఈ సినిమా కథగా రాబోతుంది. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ కంటెంట్ బేస్డ్ మూవీపై ఇప్పటికైతే ఈ పాజిటివ్ టాక్ ఉంది. ఈ ట్రైలర్ లోని రా అండ్ రస్టిక్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
‘పొట్టేల్’ సినిమాలో మదర్ రోల్‌లో కనిపించినట్లు హీరోయిన్ అనన్య నాగళ్ల చెప్పారు. తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో తనను కడుపులో తన్నే సీన్ ఉందని, ఆ సన్నివేశంలో నటించేందుకు భయపడ్డానని తెలిపారు. సీనియర్ యాక్టర్ అజయ్ ఇచ్చిన ధైర్యంతో ఆ సీన్ కంఫర్టబుల్‌గా చేసినట్లు చెప్పారు. ఈ సినిమా చూసి తన అమ్మ గర్వంగా ఫీల్ అవుతారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్ సాబ్ అనన్య అనే పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనన్య తెలిపారు. కాగా అనన్య నటిస్తోన్న శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా… సతీష్ వేగేశ్న గారి కథకళి సినిమా, ‘లేచింది మహిళా లోకం’అనే సినిమా చేస్తున్నారు.