Anantapur

Anantapur: ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతులు

Anantapur: వాడిని ఇద్దరు ప్రేమించారు. ఇద్దరు ప్రేమిస్తున్న మ్యాటర్ వాడికి తెలుసు . కాని …తెలియనట్లు ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడుగుతే…ప్రేమిస్తున్నా ..కానియె వారిని అనేది చెప్పను అని చెప్పాడు. ఆ ఇద్దరి ప్రేమ సిన్సియర్ లవ్…వాడిది మాత్రం ఏ సైడ్ లవ్ మాత్రం తెలియదు. అందుకే ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక పని చేసారు …

ప్రేమ గుడ్డిదంటారు. భావోద్వేగంలో మంచి చెడు అనే విచక్షణ ఉండదు. తాము ప్రేమించే దాని కోసం మనిషి ఏమైనా చేస్తాడు. దాన్ని పొందకపోతే నైరాశ్యంతో జీవితానికి అర్థం లేదని భావిస్తాడు. ఈ క్రమంలో ప్రేమ కోసం ప్రాణాలు బలిగొన్ని వారు ఎందరో. కానీ తాజాగా ఒక విచిత్ర ఘటన జరిగింది. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించారు. అతను దక్కకపోయే సరికి విషం తాగారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చగా ఒకరు మరిణించారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ట్రై యాంగిల్ లవ్ ట్రాజెడీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది.

అనంతపురం జిల్లాలకు చెందిన దివాకర్ అనే యువకుడిని రేష్మ, శారద అనే యువతులు ప్రేమించారు. అయితే వీరిద్దరిలో దివాకర్ ఎవరిని ప్రేమించాడో స్పష్టత లేదు. దివాకర్ గాఢంగా ప్రేమించిన ఈ ఇద్దరు యువతులు తమ ప్రేమ దక్కదని తెలిసి బాధపడ్డారు. దివాకర్ లేని ప్రపంచ తమకు వృథాగా భావించి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం ముందుగానే ప్లాన్ చేశారు.

Also Read: Baking soda side effects: వంటకాల తయారీలో బేకింగ్ సోడా వాడుతున్నారా ? జాగ్రత్త

ఇద్దరూ స్థానిక ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లి విషం తాగారు. విషం తాగే ముందు దివాకర్ కు ఫోన్ చేసి తాము ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతున్నామని తెలిపారు. ఇది తెలిసిన దివాకర్ షాక్ కు గురయ్యాడు. పరుగు పరుగున ఆర్టీవో ఆఫీస్ వచ్చాడు. కానీ అప్పటికే రేష్మ, శారద ఇద్దరూ విషం తాగేశారు. వారి పరిస్థితి చూసి ఏం చేయాలో తోచక దివాకర్ ఇద్దరినీ ఆస్పత్రికి తన భుజాలపై తీసుకెళ్లాడు.

అయితే ఆస్పత్రిలో ఇద్దరి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు వారిద్దరూ ఏ విషం తాగారో అడిగారు. ఆ యువతులిద్దరూ సూపర్ వాస్కోల్ ( తాగారని తెలిసి చికిత్స ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు శారద చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు రేష్మ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.శారద చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి దివాకర్ పై ఫిర్యాదు చేశారు. అతడి వల్లే తమ కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ALSO READ  Crime News: ఇరుగింటి వివాహిత‌ను చెల్లి అని పిలిచేవాడు.. లైంగిక‌దాడికి య‌త్నించాడు.. ప్ర‌తిఘ‌టించ‌డంతో ఏం చేసిండో తెలుసా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *