Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న వార్తతో ఈ ఉద్రిక్తతకు దారితీసింది.
పెద్దారెడ్డి రాక నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున జేసీ అనుచరులు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Chennai: బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు.. అసెంబ్లీలో బిల్లు
Anantapur: ఈ నేపథ్యంలో “తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తాం” అని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు, “తాడిపత్రికి వచ్చేందుకు అన్ని అనుమతులు ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు నన్ను పట్టణంలోకి రానివ్వడం లేదు” అని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

