Nidurinchu Jahapana: బాలనటుడిగా పలు చిత్రాలలో నటించి అలరించిన ఆనంద వర్థన్ ఇప్పుడు ‘నిదురించు జహాపన’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రసన్నకుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ‘నాంది’ ఫేమ్ నవమి గయాక్ నటిస్తోంది. రోష్ని సాహోతా మరో నాయిక. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మనిషి నిద్రపోయే వరకూ సైన్స్ అయితే… నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ’ అంటూ మొదలయ్యే టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు. రామరాజు, పోసాని కృష్ణ మురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదొరై, జబర్దస్త్ శాంతి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆనంద్ వర్థన్ కు హీరోగా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.