Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya: ఎపిక్ షూటింగ్ ముగిసింది.. వైష్ణవి ఎమోషనల్ పోస్ట్!

Vaishnavi Chaitanya: బేబి సెన్సేషన్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఎపిక్ చిత్రం షూటింగ్ పూర్తయింది. లాస్ట్ డే షూట్ తర్వాత వైష్ణవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ చిత్ర యూనిట్ తనకు కుటుంబంలా మారిందని ఆమె తెలిపింది.

Also Read: NTR-Neel: లొకేషన్ రెక్కీలో తారక్ ఇంటర్నేషనల్ సినిమా!

బేబి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. లాస్ట్ డే షూట్ సందర్భంగా వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఫొటోలు షేర్ చేసింది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసిన సినిమాగా ఎపిక్‌ను ఆమె అభివర్ణించింది. చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరూ తనకు కుటుంబ సభ్యుల్లా మారిపోయారని, ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం ఆనందంగా ఉందని తెలిపింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బేబి సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *