Anam: పల్నాడులో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానున్నట్టు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకంలో ప్రతి రైతుకు రూ.20 వేలు సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన మంత్రి ఆనం, అప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని పదిన్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.