Anagani satyaprasad: జగన్ వి కుట్రపూరిత వ్యాఖ్యలు

Anagani satyaprasad: మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు తనను స్పష్టంగా ఓటమిపాలుచేసిన తర్వాత కూడా జగన్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అదే అహంకార ధోరణిని కొనసాగిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నదీ గర్భంలో రాజధాని నిర్మిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రాజధాని చట్టపరమైన చర్యలు ఫలితమివ్వబోతున్నాయనే భయంతో జగన్ కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. సోకాల్‌డ్ క్యాపిటల్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావాలను అవమానిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టి వారి ఆకాంక్షలను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పురోగతికి అడ్డు తప్ప మరేమీ కాని రాజకీయాలే జగన్ మాట్లాడుతున్నారని అనగాని ఘాటుగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *