Anaganaga Oka Raju

Anaganaga Oka Raju: ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘అనగనగా ఒక రాజు’!

Anaganaga Oka Raju: సంక్రాంతి సందడిలో థియేటర్లకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. యువ నటుడు నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశీ మార్కెట్‌లోనూ రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం నాటికి ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును దాటి సరికొత్త సంచలనం సృష్టించింది. దీనితో నవీన్ పొలిశెట్టి నటించిన వరుసగా మూడు సినిమాలు (జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు) విదేశాల్లో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లయ్యింది. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది యువ హీరోల్లో నవీన్ ఒకరిగా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

Also Read: Pushpa 3: అల్లు అర్జున్–సుకుమార్ కాంబో మళ్లీ: పుష్ప 3 పనులు ప్రారంభం?

భారీ అంచనాల మధ్య జనవరి 14న విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పెద్ద హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, కేవలం తన కామెడీ టైమింగ్‌తో నవీన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. సినిమా పొడవునా నవ్వులు పూయించడమే కాకుండా, ముగింపులో వచ్చే ఎమోషనల్ సీన్లు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అసలు సిసలైన ‘సంక్రాంతి సినిమా’గా అభివర్ణిస్తున్నారు.

ఈ సినిమా వసూళ్ల పరంగా చూస్తే నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 61.1 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో నవీన్‌కు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ ఈ సినిమా వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. భారీ ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *