Ravi Teja: టాలీవుడ్‌లో కార్మిక సంఘాల బంద్ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. వేతనాల పెంపుపై చర్చలు ఫలించకపోవడంతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ, ఒక మాంటేజ్ సాంగ్, ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 27న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు బంద్ అడ్డంకిగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని సంఘాలు హెచ్చరించాయి. ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరుగుతున్నాయి. రేపటిలోగా పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఈ బంద్ ప్రభావం సినిమా రిలీజ్‌పై ఎలా ఉంటుందో చూడాలి.
