Amma Rajasekhar Thala Movie

Amma Rajasekhar Thala Movie: తల మూవీ ట్రైలర్ గ్రాండ్‌ లాంచ్.. సినిమా ఎప్పుడంటే..

Amma Rajasekhar Thala Movie: అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగింరాజ్, అంకిత నాన్సార్ కథానాయికగా నటించిన చిత్రం ‘తల’. పి.శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, రాధా రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోహిత్, ఎస్తేర్ నొరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. సోహెల్‌, హీరో అశ్విన్‌బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎడిటర్ శివ సర్ని మాట్లాడుతూ.. ట్రైలర్‌లో గూస్ బంప్స్ కంటే సినిమాలో చాలా ఎక్కువ ఉంటాయన్నారు. ప్రతి సీన్‌లో ఎలివేషన్స్ ఉన్నాయి.. ట్రైలర్‌లో చాలా తక్కువ చూపించాం. సినిమా చాలా బాగా వచ్చింది… ఫిబ్రవరి 14న వస్తున్నాం మీ ముందుకు వస్తున్నాం ఆశీర్వదించండి.” అన్నారు.

డి.వెంకట్ మాట్లాడుతూ.. ‘అమ్మ రాజశేఖర్ ఇప్పటికే సినిమా చూశారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మీ ముందుకు వస్తున్నారు. కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఆయన ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ గౌడ్, చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సంగీత దర్శకుడు ధర్మతేజ మాట్లాడుతూ.. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ సినిమా ట్రైలర్ కంటే ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంటుంది. . ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న దీపా ఆర్ట్స్‌కి ధన్యవాదాలు. రాగిన్ రాజ్ చాలా బాగా నటించాడు. సినిమా అంతా చాలా నేచురల్‌గా ఉంటుంది’’ అన్నారు.

సందీప్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. సెట్‌లో చాలా కంఫర్టబుల్‌గా పని చేశాం. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఆనందించాను. అమ్మ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. రాగిన్ చాలా బాగా నటించాడు’’ అన్నారు.

ఎస్తేర్ నొరోన్హా మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ నేనే చేయమని చెప్పి వారితో నటించేలా చేశారు. రాగినాకు ఈ సినిమా మంచి డెబ్యూ మూవీ అవుతుంది. మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంకితను కూడా చాలా బాగా చూపించారు. సినిమా బాగా రావాలి అనుకున్నప్పుడు ఒక్కరు పని చేస్తే సరిపోదు. సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. మా అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది. అందరూ సినిమా చూడాలి. మీ కృషి వల్ల, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టర్నింగ్ పాయింట్ కావాలి. అంతేకాదు కెరీర్ గ్రాఫ్ రెండింతలు, మూడు రెట్లు పెరగాలన్నది నా కోరిక. నిర్మాతగారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు.

హీరోయిన్ అంకిత నాస్కర్ మాట్లాడుతూ.. నాకు తెలుగు రాదు. నేను బెంగాలీని. ఇది నా మొదటి సినిమా. మొదటి అనుభవం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మ రాజశేఖర్ సార్ కి ధన్యవాదాలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున మా సినిమా వస్తోంది. అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలి’’ అన్నారు.

ALSO READ  Mahaa Vamsi: లావణ్య సంచలనం..మస్తాన్ ఫోన్ లో 300 న్యూడ్ వీడియోలు

హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ… సినిమాలో అందరూ చాలా కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు. వాతావరణ మార్పుల వల్ల చాలా నష్టపోయాం. ఈ సినిమా కోసం మా అమ్మ, నాన్న చాలా కష్టపడ్డారు. వారు ఎంతో సహాయం చేసారు. ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్‌గౌడ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా మీ డబ్బుకు న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న హింసాత్మక వాలెంటైన్స్‌ని తప్పక చూడండి. ధన్యవాదాలు.”

రాధా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మీరు హింసాత్మకమైన వాలెంటైన్‌గా భావించాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. యాక్షన్, పాటలు, కంటెంట్ అన్నీ ఉంటాయి. అమ్మ రాజశేఖర్ కథకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు’’ అన్నారు.

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మ రాజశేఖర్ తన మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచి నాకు అవకాశం ఇస్తాను అనేవారు. ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇదేమిటని ఆయన్ను అడగ్గా తదుపరి సినిమా అని చెప్పారు. అలా చివరికి రెండు సినిమాల తర్వాత నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెన్నై మొత్తం చూపించారు. నేను రాగిన్ పుట్టినరోజుకి వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అనిచెప్పారు. హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ప్రేమికుల రోజున ‘తల’ వయలెంట్ విడుదల కానుంది. అందరూ చూడాల్సిందే’ అన్నారు.

నటుడు సోహెల్ మాట్లాడుతూ.. తల ఎవరో నాకు తెలియదు, అయితే మోషన్ టీజర్‌ను ముందుగా నాకు పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డాన్స్ బేబీ డాన్స్ నుండి తెలుసు. తర్వాత బిగ్ బాస్‌లో కలిశాం. అమ్మ రాజశేఖర్ తన పేరుకు తగ్గట్టుగా అందరికీ వండి పెట్టేవారు. వారు తినకపోయినా, అందరి ఆకలి తీర్చేవారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాడు. ర‌ణం సినిమా త‌ర్వాత ఈ సినిమా క‌మ్ బ్యాక్ అని తెలుస్తోంది. తల టీజర్ చూశాక అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇండస్ట్రీలో ధనుష్ తర్వాత రాగిన్ అవుతాడు అని అన్నారు.

హీరో అశ్విన్‌బాబు “తల ట్రైలర్ చూశాను. అసాధారణంగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. తండ్రి దర్శకుడు, తల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, సోదరి ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ కావడం అదృష్టం. విజువల్స్ తక్కువ బడ్జెట్‌లో కంటెంట్‌ను ‘తల’ మూవీ అద్భుతంగా రూపొందించారన్నారు. .

ALSO READ  ప్రత్యేక దేశం కోసం ఖలిస్థాన్ ఉగ్రవాదుల పెద్ద ప్లాన్.. ఆన్ లైన్ లో ఓటింగ్!

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ అయిపోయారని చెప్పారు. ఇప్పుడు తల ఎత్తుకుని వస్తాను.. చేతులు, కాళ్లు, అన్నిటితో వస్తున్నాను. అమ్మకి బాగోలేదు కాబట్టి గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను స్వేచ్ఛగా ఉన్నాను. మా అబ్బాయితో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి కోరిక. ఓ వేదిక మీద అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని ఓ పరిస్థితిలో చెప్పాను. అది ఎప్పుడో అందరికీ తెలుసు. అప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. నాకు ఓ అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. నాకు మంచి కథ కావాలి. నిజజీవితంలో ప్రేమ ప్రపోజల్ చేసి మరుసటి రోజే పెళ్లి అనే కథలా కాకుండా మాస్ చేయాలంటే ఏం చేసి మాస్ చేయాలా అని ఆలోచించినా.. అబ్బాయితో ఎలా చేయాలా అని ఆలోచించినా.. రెండేళ్ళ పాటు ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకుని, కొత్తదనాన్ని కోరుకునే ఎవరైనా హ్యాపీగా సినిమా చూడొచ్చు. శ్రీనివాస్ గౌడ్ నా దేవుడు. నా కుటుంబం మొత్తం రుణపడి ఉంది. ఈ సినిమాను కొని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తే వాళ్లకు గట్స్ కావాలి. శ్రీనివాస్ గౌడ్ దేవుడు చూస్తున్నాడు. నా కొడుకు. లక్కీ శ్యామ్ కె నాయుడు టీమ్ రావడం ముఖ్యం. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం శ్యామ్ కె నాయుడు. రెండు రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి ఓకే చెప్పాడు. నేను అతనిని ఎప్పటికీ మరచిపోలేను. రోహిత్, ఎస్తేర్, అంకిత, సత్యం రాజేష్ అందరికీ ధన్యవాదాలు. అమ్మ రాజశేఖర్ సినిమాలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఇచ్చిన తేజ గారికి ధన్యవాదాలు. మీరు సినిమాను మా ఇళ్లకు తీసుకొచ్చారు. నా కూతురికి, నా భార్య రాధకు, టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత: శ్రీనివాసగౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, వీజీ చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రచయితలు: అమ్మ రాజశేఖర్
DOP: శ్యామ్ కె నాయుడు
పాట: థమన్ ఎస్ఎస్
సంగీత దర్శకుడు: ధర్మ తేజ, అస్లాం కీ
BGM: అస్లాం కీ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీమ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధా రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌లు: అమ్మ రాజశేఖర్
సాహిత్యం: ధర్మతేజ
ఎడిటర్: శివ సామి
PRO: మధు VR
డిజిటల్ మీడియా: డిజిటల్ దూకనం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *