Thala: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. కింగ్ నాగార్జున బుక్ మై షోలో తల సినిమా ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నేడు విడుదల అయ్యింది. తల సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయడంలో అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో డైరెక్టర్ గా అనుభవం ఉండటం వలన ఈ సినిమాని బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా అమ్మ రాజశేఖర్ రాసుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ సీన్స్ కి తగ్గట్టే కథని ముందుకు నడిపించారు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడంలో సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.
