Amith Sha: హైదరాబాద్ నగరంలో 200 మందికి పైగా పాకిస్తాన్ దేశస్తులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. వారందరినీ వెనక్కి పంపాలని తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.
Amith Sha: వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ దేశస్తులను వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 27లోగా పాకిస్తాన్ దేశీయులు ఎవరు ఉన్నా దేశం విడిచి వెళ్లిపోవాలని ఇప్పటికే ఆదేశాలను జారీచేసింది. పాస్‌పోర్ట్ గడువు ఉన్నాకూడా ఈ నెల 27లోగా దేశం విడిచి వెళ్లాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసింది.
Amith Sha: ఈ విషయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ లో 200 మందికి పైగా ఉన్నట్టు గుర్తించామని, వారిని వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కేంద్రం ఆదేశాల మేరకు పాకిస్తాన్ దేశస్తులను వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
