Amit Shah: గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని చెప్పారు. 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు.
నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు.చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి: Weather Report: ఉత్తర భారతంలో రికార్డులు బద్దలు కొడుతున్న చలి
Amit Shah: మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు. నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా కలను సాకారం చేయడంలో చత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు.