America Telugu Sambaralu

America Telugu Sambaralu: జూలై 4 నుంచి మూడురోజుల పాటు NATS ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరాలు

America Telugu Sambaralu: అమెరికాలో తెలుగు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు ప్రజలందరినీ ఒక్కదగ్గరికి చేరుస్తూ . . సంబరాలు నిర్వహిస్తూ వస్తోంది .  తెలుగు సంప్రదాయాలు . . సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడి తెలుగు ప్రజలే కాకుండా స్థానిక ప్రజలు కూడా చెప్పుకునేలా ఈ సంబరాలను నిర్వహిస్తున్నారు .  ఈ సంవత్సరం 8వ అమెరికా తెలుగు సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

America Telugu Sambaralu (1)

జూలై 4 నుంచి 6 వరకూ మూడురోజుల పాటు తెలుగు సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు .  తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారధులు హాజరు కానున్న ఈ సంబరాల్లో తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు .  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసిన నాయకులు . . తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్న ప్రముఖ నటీనటులు . . తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు . . తెలుగు సాహిత్య రంగంలో సేవలందిస్తున్న రచయితలు.. తమ ఆధ్యాత్మిక ప్రవచనాలతో తెలుగు ప్రజలకు నిత్యం దైవ సాన్నిహిత్యాన్ని అందిస్తున్న ఆధ్యాత్మిక వేత్తలు . . ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు మూడురోజుల అమెరికా తెలుగు సంబరాల్లో అక్కడి తెలుగు ప్రజలతో మమేకం కానున్నారు .

America Telugu Sambaralu (2)

టంపా కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించే ఈ సంబరాలకు మహాన్యూస్ ,  మహాన్యూస్ యూఎస్ఏ అధికార మీడియా పార్తనర్స్ గా వ్యవహరిస్తున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మహా న్యూస్.

America Telugu Sambaralu

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *