America: అమెరికాలో ఘోరం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం 

America: అమెరికాలో జరిగిన దుర్మరణ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌కు చెందిన కుటుంబం పూర్తిగా దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన ఒక్లాహోమా రాష్ట్రంలోని గ్రీన్ కౌంటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అట్లాంటా నుంచి డల్లాస్‌కి ప్రయాణిస్తున్న సమయంలో, వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు ఒక్కసారిగా మంటల్లో మునిగిపోయింది. ఆ సమయంలో కారులో ఉన్న వెంకట్, ఆయన భార్య తేజస్వినితో పాటు, వారి ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.కారులో మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు వచ్చే అవకాశం లేకుండా నలుగురు సజీవదహనమయ్యారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. అమెరికాలో ఉన్న తెలుగు సమాజం, బంధువులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎప్పుడూ కలసిమెలసి కనిపించే ఈ కుటుంబం ఇలా ఒకేసారి మృతి చెందడం అందరినీ కలచివేసింది.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *