America:

America: గాలిలో ఉండ‌గానే బోయింగ్ విమానానికి మంట‌లు.. పైల‌ట్ చేసిన పనికి..

America: అది బోయింగ్ 767-400 విమానం.. ప్ర‌యాణికుల‌తో ఆకాశంలో వెళ్తున్న‌ది.. ఒక్క‌సారిగా ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి.. ప్ర‌యాణికుల హాహాకారాలు.. ఇప్ప‌టికే బిక్కుబిక్కుమంటూ ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల ప్రాణాలు పైపైనే తేలియాడుతున్నాయి.. ఈ స‌మ‌యంలో పైల‌ట్ స‌మ‌య‌స్ఫూర్తితో విమానం సేఫ్‌గా ల్యాండ‌యింది. ప్ర‌యాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

America: డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానం అమెరికాలోని లాస్ ఎంజెల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్నది. ఆ విమానం గాల్లో ఉండగానే ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఎడ‌మ వైపు ఇంజిన్‌లో ఈ మంట‌లు వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో పైల‌ట్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. ఈ స‌మ‌యంలో విమానాన్ని తిరిగి లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్టులో పైల‌ట్‌ సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు.

America: ఈ స‌మ‌యంలో విమానం ర‌న్‌వే పైకి రాగానే ఫైర్ సిబ్బంది వెంట‌నే విమానంలో చెల‌రేగుతున్న మంట‌ల‌ను ఆర్పివేశారు. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణికుల‌కు, సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదం చోటుచేసుకోలేదు. దీంతో విమాన‌యాన శాఖ అధికారులు, ప్ర‌యాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Donald Trump: చర్చల తర్వాత మారిపోయిన ట్రంప్.. భారతకు ఉపశమనం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *