Ambati Rayudu: భారత్-పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌తో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇండియన్ ఆర్మీని మన దేశ ప్రజలంతా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అటు బీసీసీఐ సైతం ఆర్మీ తీసుకునే నిర్ణయాకుల మద్ధతుగా ఉంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో దుమారం రేపుతుంది. అతడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు.
విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతిదాడికి దిగికపోతే వారు మనపై దాడులు చేస్తూనే ఉంటారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ రాయుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ దుశ్చర్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.
Also Read: Operation Sindoor: ఇండియన్ ఆర్మీపై విరాట్ కోహ్లీ, అనుష్క ప్రశంసలు
ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు యూటర్న్ తీసుకున్నాడు. ఆ ట్వీట్‌ను తొలగించకపోయినా.. ప్రజలను కూల్ చేసేందుకు మరో రెండు ట్వీట్‌లు చేశాడు. ‘‘జమ్మూ కశ్మీర్, పంజాబ్ సహా దేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత, త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ‘‘ఇలాంటి సమయంలో మేము భయంతో కాదు, ధృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాం. అసమాన ధైర్యం, నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు.
మీ త్యాగాలు వృథా పోవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. జై హింద్’’ అంటూ మరో ట్వీట్లో రాసుకొచ్చాడు. నెటిజన్లు మాత్రం ఫస్ట్ ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఆ తర్వాత చేసిన రెండు ట్వీట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు.