Amazon layoffs

Amazon layoffs: అమెజాన్‌లో భారీ కోత: 30,000 మంది ఉద్యోగులు ఔట్!

Amazon layoffs: ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా, ఈ వారం నుంచే దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని సంస్థ యోచిస్తోంది.

ఈ తొలగింపులు సుమారు 3,50,000 మంది కార్పొరేట్ ఉద్యోగులలో దాదాపు 10 శాతం మందిని ప్రభావితం చేయనున్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య (1.55 మిలియన్లు) తో పోలిస్తే ఇది తక్కువ శాతమైనప్పటికీ, 2022 చివరలో జరిగిన 27,000 ఉద్యోగ కోత తర్వాత ఇది అతిపెద్ద తగ్గింపు కానుంది.

ఇది కూడా చదవండి: KCR: హరీశ్‌ రావుకు పితృవియోగం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం

కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా చేసిన అధిక నియామకాలను సరిదిద్దుకోవడానికి సంస్థలో పేరుకుపోయిన అనవసరమైన వ్యవస్థలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కోతలు ప్రధానంగా పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ, పరిక‌రాలు & సేవలు కార్యకలాపాల విభాగాలపై ప్రభావం చూపవచ్చు.

ప్రభావితమయ్యే బృందాల నిర్వాహకులు ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయడానికి సోమవారం శిక్షణ తీసుకున్నారని, మంగళవారం ఉదయం నుంచే ఈమెయిల్స్ ద్వారా తొలగింపు సమాచారం అందే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగార్థులు, టెక్ రంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *