Amaravati Land Pooling

Amaravati Land Pooling: రెండో విడత ల్యాండ్‌ పూలింగ్ ప్రారంభం.. 4 ఎకరాలు ఇచ్చిన రైతు!

Amaravati Land Pooling: ఏపీ రాజధాని అమరావతికి భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్) ప్రక్రియ రెండో విడతలో వేగం పుంజుకుంది. గురువారం (ఈరోజు) అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో జరిగిన గ్రామ సభతో అధికారులు ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో, రైతు నంబూరి బలరాం తన 4 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు.

యండ్రాయిలో రెండో విడత ప్రారంభం

అమరావతిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగ్ ప్రక్రియను అధికారులు ఈరోజు (గురువారం) ప్రారంభించారు. తొలిదశలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా యండ్రాయి గ్రామాన్ని ఎంపిక చేశారు. యండ్రాయిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు రాష్ట్ర మంత్రి నారాయణ ఇంకా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. ల్యాండ్‌ పూలింగ్‌ ప్రయోజనాలు, విధానం గురించి వారు రైతులకు వివరించారు.

ఇది కూడా చదవండి: Putin India Visit: నేడు భారత్‌లో పుతిన్‌ పర్యటన – ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

అమరావతికి ఉదారత చాటుకున్న రైతు

ఈ సందర్భంగా యండ్రాయి రైతు నంబూరి బలరాం గొప్ప మనసు చాటుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి తనవంతుగా మద్దతు తెలుపుతూ. రైతు నంబూరి బలరాం తనకున్న 4 ఎకరాల భూముని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఉదారంగా ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో నంబూరి బలరాం తన పొలం పత్రాలను నేరుగా మంత్రి నారాయణకు అందజేశారు. గ్రామ సభలో మంత్రి నారాయణ రైతుల సమస్యలు, అభ్యంతరాలను సావధానంగా విని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతు నంబూరి బలరాం అందించిన సహకారం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *