Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఐదురకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబడింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుకు మొత్తం 8,458 బస్సులను వినియోగించనున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పొందేందుకు ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపించాలి. అర్హులైన మహిళలకు జీరో టికెట్ జారీ చేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.