Amaravati: అమరావతి నగర నిర్మాణంలో మరోసారి కీలక మలుపు తిరిగింది. 2018లో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ముందుకు వచ్చిన సింగపూర్, తరువాత గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. అప్పట్లో సింగపూర్–సీఆర్డీఏ మధ్య 1,679 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు సింగపూర్ స్థానంలో వియత్నాం ముందుకు వచ్చింది.
తాజాగా అమరావతిలో 2,000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయడానికి వియత్నాం సిద్ధమైంది. దీంతో కొత్త ఉత్సాహం, పెట్టుబడులపై ఆశలు కలిగిస్తున్న ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది.