Amaravati: సీఎం రేవంత్ వ్యాఖ్యలు తప్పుబట్టిన ఏపీ ప్రభుత్వం

Amaravati : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది. తన విన్నపం మేరకు చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేశారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వ ప్రకటన ప్రకారం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే అనుమతులు లేకుండానే ప్రారంభించింది. అదే సమయంలో సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అందిస్తామని అప్పటి ప్రభుత్వం భారీ ప్రచారం నిర్వహించిందని తెలిపింది.

జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనులు, చేసిన ప్రచారమే తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు దారితీసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని, గతంలో తీసుకున్న చర్యల కారణంగానే ఈ వివాదం తలెత్తిందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *