Amaravati: అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ కీలక ముందడుగు వేసింది. గతంలో పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన ప్రాజెక్టులకు తాజాగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కసం అత్యాధునిక నివాస సముదాయాల నిర్మాణానికి రూ.1,329 కోట్లతో కూడిన ప్రాజెక్ట్‌కు అనుమతి లభించింది. ఇదే విధంగా, అన్ని కేంద్ర శాఖల కార్యాలయాల కోసం ఏర్పాటు చేయనున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.1,458 కోట్ల నిధులతో మరో ప్రాజెక్ట్‌కు కూడా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ రెండు ప్రాజెక్టులు 2018 నుంచే పెండింగ్‌లో ఉన్నాయి. అనేక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టులకు తాజాగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో అమరావతి అభివృద్ధి పునరుద్ధరణ దిశగా వేగంగా ముందుకెళ్లే అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియలు తదితరాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రివర్గ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన మైలురాయిగా చెబుతున్నారు.