Amaravati: టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షులు వీరే

Amaravati: తెలుగుదేశం పార్టీ లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన నేతల పేర్ల జాబితాను టీడీపీ అధికారికంగా ప్రకటించింది.

పార్టీ కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు ఈ ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అభ్యర్థుల సామర్థ్యం, సీనియారిటీ, విధేయతతో పాటు సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేసినట్లు తెలిపారు.

🔹 జిల్లా వారీగా నియమితులైన నేతల వివరాలు:

  1. అనకాపల్లి – అధ్యక్షుడు: బత్తుల తాతయ్యబాబు | ప్రధాన కార్యదర్శి: లాలం కాశీ నాయుడు
  2. అరకు (ఎస్టీ) – మాజోరు తేజావతి | దత్తి లక్ష్మీనారాయణ
  3. శ్రీకాకుళం – మాదవలస రమేష్ | పిరికట్టు విరల్ రావు
  4. విశాఖపట్నం – చోడే వెంకట పుట్టయ్యరావు | లోడగల కృష్ణ
  5. విజయనగరం – కిమిడి నాగార్జున | ప్రసాదుల వరప్రసాద్
  6. అమలాపురం – గుత్తుల సాయి | పాలం రాజు
  7. ఏలూరు – బడేటి రాధాకృష్ణ | ముత్తారెడ్డి జగన్నాథం
  8. కాకినాడ – జ్యోతుల నవీన్ | వెంకే శ్రీనివాస్ బాబు
  9. నర్సాపురం – మంతెన రామరాజు | పితాని మోహన్ రావు
  10. రాజమండ్రి – బొడ్డు వెంకట రమణాచారి | కాసి నవీన్
  11. బాపట్ల – నలగల రాజశేఖర్ బాబు | నక్కల రామకృష్ణ
  12. గుంటూరు – పిల్లి మాణిక్యరావు | పోతినేని శ్రీనివాసరావు
  13. మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి | గోపు సత్యనారాయణ
  14. నరసరావుపేట – షేక్ జానె సైదా | నల్లపాటి రామచంద్ర ప్రసాద్
  15. విజయవాడ – గద్దె అనురాధ | చెన్నుబోయిన చిట్టిబాబు
  16. చిత్తూరు – పల్లె గ రెడ్డి | వై.సునీల్ కుమార్ చౌదరి
  17. నెల్లూరు – బీద రవిచంద్ర | చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి
  18. ఒంగోలు – ఉగ్ర నరసింహ రెడ్డి | కోలారి నాగేశ్వరరావు
  19. రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు | వరన్ భాస్కర్ భాన్
  20. తిరుపతి – పనబాక లక్ష్మీ | డాలర్ దివాకర్ రెడ్డి
  21. అనంతపురం – పూల నాగరాజు | జి. శ్రీధర్ చౌదరి
  22. హిందూపూర్ – ఎం.ఎన్. రాజు | హనుమంత
  23. కడప – చదివిరాళ్ల భూపేష్ సుబ్రహ్మణి రెడ్డి | వై.ఎస్. జయకుమార్
  24. కర్నూలు – గుడిశె కృష్ణమూర్తి | పూల నాగరాజు యాదవ్
  25. నంద్యాల – గారు చలపతి రెడ్డి | ఎన్.ఎం.డి. ఫిరోజ్

పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *