Kalvakuntla Kavitha: దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కర్ణాటక ప్రభుత్వం డ్యాం ఎత్తును 5 మీటర్ల మేర పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంఎల్పీ కవిత తీవ్రంగా స్పందించారు.
కృష్ణానది వరప్రదాయిని – కానీ ప్రమాదంలో!
“కృష్ణా నది వరప్రదాయినిలా ఉంది. కానీ, ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు వచ్చే నీటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొలాల్లో పంటలు పండించడమంటే కష్టమవుతుంది. అప్పుడు మనకు క్రికెట్ ఆడటానికి మైదానం తప్ప ఇంకేమీ మిగలదు” అని కవిత హెచ్చరించారు. ఆల్మట్టి హైట్ పెంచకుండ ఉమ్మడి ఏపీలో జీవో ఉంది ఆమె గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Telangana Police: పండుగలకు ఊరెళ్తున్నారా? పోలీస్ శాఖ హెచ్చరికలు ఇవే..
సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. “ఆల్మట్టి ఎత్తు పెరిగితే, సీఎం సొంత జిల్లాకే నీరు రాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సోనియాగాంధీతో మాట్లాడి సిద్ధరామయ్యను ఒప్పించాలి” అని కవిత వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బనకచర్ల జలవివాదం విషయంలో కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.
బతుకమ్మ, బహుమతులపై వ్యాఖ్యలు
తనపై వస్తున్న విమర్శలకు కవిత సమాధానం ఇస్తూ, “ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. నేను చింతమడకలో బతుకమ్మ వేడుకలకు వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. అదేవిధంగా, బతుకమ్మ పండుగ పేరుతోనే చీరలు పంచాలి కానీ, ఇతర పేర్లతో కాదు” అని చెప్పారు.
సోషల్ మీడియాలో దాడులు – రాజీనామాపై ఆలస్యం
BRS, హరీష్, సంతోష్ సోషల్ మీడియాలో నాపై అనవసర విమర్శలు చేస్తున్నారు. నా రాజీనామా ఆమోదం ఎందుకు ఆలస్యం అవుతోందో నాకు తెలియదు. నాపై వ్యక్తిగతంగా దాడులు చేయడం సరికాదు అని ఆమె పేర్కొన్నారు.