Allu Sirish: అల్లు శిరీష్‌కు బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూపు కొనసాగుతోంది. గత చిత్రాలైన కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, బడ్డీ ఆకట్టుకున్నా, వాణిజ్యపరంగా విజయం సాధించలేదు. ఈసారి శిరీష్ కామెడీ ఎంటర్టైనర్తో సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించారు. బచ్చలమల్లి ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో ఓ ఫన్ ఫిల్డ్ స్క్రిప్ట్‌ను ఓకే చేశారు. సుబ్బు రూపొందించిన కామెడీ కథ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం శిరీష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

