prabhas

Prabhas: ఆ స్టార్ కిడ్స్ అందరి ఫేవరేట్ ప్రభాస్!?

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోలంటే వారి అభిమానులు పడి చచ్చిపోతుంటారు. అయితే ఆ స్టార్ హీరోల వారసులకు నచ్చిన హీరో మాత్రం వేరే ఉంటుంటారు. అలా ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తనకు నచ్చిన హీరో ప్రభాస్ అని చెప్పేశాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ గా వైరల్ అవుతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాన్ తనయుడు అకీరానందన్ ఎంట్రీ గురించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీలో క్రికెట్ టీమ్ కి సరిపడా హీరో గ్యాంగ్ ఉంది. అయితే అకీరాకి నచ్చిన హీరో మాత్రం ప్రభాస్ అట. ప్రభాస్ సినిమా ఏదీ మిస్ కాకుండా చూస్తుంటాడట.

ఇది కూడా చదవండి: Rana Daggubati: ‘జై హనుమాన్’లో ప్రతినాయకుడిగా రానా..?

ప్రభాస్ లేటెస్ట్ ‘కల్కి 2898ఎడి’ సినిమాను క్రాస్ రోడ్స్ ఆడియన్స్ మధ్య చూశాడు అకీరా. ఆ టైమ్ లో అది బాగా వైరల్ అయింది కూడా. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఒకే ఒక్క స్టార్ హీరో ప్రభాస్. వీళ్ళీ కాదు ఇలా ఎంతో మంది స్టార్స్ పిల్లలు ఇష్టపడే హీరో ఫ్రభాస్. తన ఫ్రెండ్లీ నేచర్ ని పిల్లలు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్2’, ‘కల్కి2’ సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఇవి కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనకరాజ్ లైన్ లో ఉన్నారట. ఇవన్నీ పూర్తయ్యే నాటికి ఇకెంత మంది స్టార్ కిడ్స్ ప్రబాస్ తమ అభిమాన హీరో అని ప్రకటిస్తారో. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *