Allu Arjun:ప్రముఖ సినీ నటుడు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తుపట్టలేదు. ఆయన అల్లు అర్జున్ గారు.. అని వ్యక్తిగత సిబ్బంది చెప్పినా వారు వినలేదు. కళ్లజోడు, మాస్క్ తీశాకే తనిఖీలు చేసిన తర్వాత అల్లు అర్జున్‌ను పంపించారు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం (ఆగస్టు 10) చోటుచేసుకున్నది. ఈ వార్త దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Allu Arjun:పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో క్రేజీ సంపాదించుకున్న సినీ నటుడు అల్లు అర్జున్ కళ్లజోడు, మాస్క్ పెట్టుకొని వెళ్లుండగా, ముంబై ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది నిలిపేశారు. ఆయన అల్లు అర్జున్ అని బన్నీ అసిస్టెంట్ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అయినా ముఖం చూపించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేదిలేక కళ్లజోడు, మాస్క్ తీయడంతో అప్పుడు నిర్ధారించుకున్న సెక్యూరిటీ సిబ్బంది వెళ్లనిచ్చారు.
Allu Arjun:పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్ అనే రెండు సినిమాలతో మాస్ క్రేజీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమాన లోకం విపరీతంగా పెరిగింది. రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో కూడా స్టార్ హీరోల సరసన అల్లు అర్జున్ చేరారు. పుష్ప ద ర్యాంపేజీ అనే మూడో సినిమా తీయబోతున్నందున ప్రేక్షక లోకంలో మరింత ఉత్కంఠ నెలకొని ఉన్నది.