Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేశాడు. పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ ఖాన్‌ల రికార్డులను సైతం దాటి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం ఉత్తర భారతదేశంలో భారీ విజయం సాధించి, ఇప్పటివరకు ఏ సినిమా అందుకోని ఘనతను అందుకుంది. ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ రేటింగ్‌లో కూడా ఐపీఎల్‌ను మించి అద్భుత రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2025 సగటు రేటింగ్ 4.6 ఉండగా, పుష్ప 2 తొలి ప్రసారంలో 5.1 టీవీఆర్ సాధించి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
అంతేకాదు, బుల్లితెరపై ఈ సినిమా సృష్టించిన హైప్ హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సినిమా రంగంలోనూ ఈ చిత్రం స్త్రీ 2 రికార్డులను అధిగమించి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యం చాటింది. ఈ విజయంతో అల్లు అర్జున్ నార్త్ మార్కెట్‌లో తన సత్తా చాటాడని నిరూపించాడు. పుష్ప రాజ్ పాత్రతో హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో సరికొత్త ఒరవడిని సృష్టించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.