Allu Arjun: పుష్ప 2 తో ఆలిండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా రొటీన్ సినిమా కాదని సోషియో మైథలాజికల్ ఫాంటసీ సినిమా అని అన్నారు. ఈ సినిమాలో బన్నీ మురుగన్ గా పిలుచుకునే కార్తికేయ అనే మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించబోతున్నట్లు నెట్టింటా ప్రచారం జరిగింది.
ఇప్పటికే ఈ సినిమా గురించి నాగవంశీ ఒకసారి మాట్లాడుతూ ఈ సినిమా గత సినిమాల లాగా ఉండదని చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ కి చాలా సమయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వస్తోంది.
Also Read: Bird Flu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టి అట్లీ సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారా? ప్రస్తుతానికి పక్కన పెట్టారా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ న్యూస్ మాత్రం అల్లు అర్జున్ ఆర్మీకి షాకింగ్ న్యూస్ లా మారింది.
Gango Renuka Thalli (Jathara)