Allu Arjun: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ప్రపంచ వ్యాప్తంగా రూల్ చేస్తోంది. ఇక ముందు రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ భారీ ఎత్తున వేయటం జరిగింది. హైదరాబాద్ లో సంధ్య థియేటర్లో జరిగిన షోకి అల్లు అర్జున్ సైతం హాజరయ్యారు. ఆ షోకి వెళ్ళే ముందు బన్నీ రౌడీ వేర్ ధరించి ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇటీవల విజయ్ దేరకొండ తనకు పుష్ప టైటిల్తో రౌడీ వేర్ ను పంపించాడని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఇప్పడు ఆ రౌడీ వేర్ ధరించి మరోసారి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాడు. అంతే కాదు కంటిన్యూ ఆనవాయితీ అని పోస్ట్ పెట్టాడు. గతంలోనూ విజయ్ దేవరకొండ పంపిన రౌడీ బ్రాండ్ వేసుకుని ప్రీమియర్ కు వెళ్లాడు. అందుకే కంటిన్యూ ఆనవాయితీ అంటూ థ్యాంక్యూ మై డియర్ స్వీటెస్ట్ బ్రదర్ విజయ్ దేవరకొండ అని బన్నీ పెట్టిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంది. రౌడీవేర్ ధరించిన బన్నీ ఫోటోను అల్లు ఫ్యాన్స్ తో పాటు రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేసి లైక్ చేస్తున్నారు.
